Kadem | గొర్రెలకు నట్టల నివారణ మందు తాగించాలి
- ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్
Kadem | కడెం, ఆంధ్రప్రభ : మేకలకు, గొర్రెలకు నట్టల నివారణకై నట్టల మందును తాగించాలని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్
అన్నారు. ఇవాళ కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల్లో, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్ మాట్లాడుతూ… మేకల, గొర్రెల పెంపకందారులు తమ జీవాలకు నట్టల నివారణ మందులు తాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ పి సౌందర్య, బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మి, డా.భూమన్న యాదవ్, లింగాపూర్ మద్దిపడగ, జెవి ఓ లు జె రాజేశ్వర్, విజయ ఓఎస్ రాజేశ్వర్, గోపాలమిత్ర గోప మల్లేష్, నాయకులు జి.కొమురయ్య, జి.అంజన్న, ఏకే మల్లేష్, జి.నగేష్, ఎం.గణేష్, రైతులు, నాయకులు, మేకల, గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు.

