Kadem | అన్ని రంగాల్లో అభివృద్ది..

Kadem | కడెం, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని సారంగాపూర్ జి.పి సర్పంచ్ అభ్యర్థి మేకల సాయమ్మ రాజారెడ్డి అన్నారు. మంగళవారం కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో సారంగాపూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి మేకల సాయమ్మ సారంగాపూర్ పలు వీధుల్లో పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో తమ కుమారుడు మేకల రాజారెడ్డి సర్పంచ్ గా చేసిన జిపి అభివృద్ధి పనులను వివరిస్తూ.. తమ బ్యాట్ గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల11న జరిగే ఎన్నికల్లో గెలిపించాలని తను గెలిపిస్తే.. సారంగాపూర్ జిపి ను మరింతగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply