kadem | సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధులు..

kadem | కడెం(నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : ఫిబ్రవరి 15న నిర్వహించనున్న సంతు శ్రీ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే జయంతి కార్యక్రమాలకు నియోజకవర్గాల వారీగా తగిన నిధులు కేటాయించాలని కడెం మండల గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు ఈ రోజు కడెం మండల కేంద్రంలో లంబాడా హక్కుల పోరాట సమితి, గిరిజన జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ… గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సంవత్సరం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం, ఖానాపూర్ పట్టణంలో నిర్వహించనున్న అధికారిక సేవాలాల్ జయంతిని ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి ఘనంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడు భూక్యా కిషన్ నాయక్, యువజన రాష్ట్ర నాయకుడు భూక్యా రాజేష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్లావత్ మోహన్ నాయక్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జి వేణుగోపాల్ నాయక్, జినంగావత్ గంగాధర్ నాయక్, సప వత్ రవి పాటు యువజన నాయకుడు బాణావత్ సిద్ధార్థ నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply