Kabaddi | హోరాహోరీగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

Kabaddi | హోరాహోరీగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

  • సెమీ ఫైనల్స్ కు చేరిన..
  • ఏ 1 ఇబ్రహీంపట్నం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జట్లు

Kabaddi | ఇబ్రహీంపట్నం,ఆంధ్రప్రభ : సంక్రాంతిని పురస్కరించుకుని స్థానిక ట్రక్ టెర్మినల్ పై టీడీపీ నాయకుడు రావి ఫణి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజుకు చేరాయి. వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయనగరం – బాపట్ల జట్ల మధ్య జరిగిన లీగ్ పోటీలో తొమ్మిది పాయింట్లతో విజయనగరం విజయం సాధించింది. ఏ 1 ఇబ్రహీంపట్నం – విశాఖపట్నం మధ్య జరిగిన పోటీలో నాలుగు పాయింట్లతో ఇబ్రహీంపట్నం జట్టు విజయం సాధించింది.

బాపట్ల – కాకినాడ మధ్య జరిగిన పోటీలో ఐదు పాయింట్లతో కాకినాడ జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం – పల్నాడు మధ్య జరిగిన పోటీలో విశాఖపట్నం 20 పాయింట్లతో ఘన విజయం సాధించింది. పశ్చిమ ఇబ్రహీంపట్నం – పశ్చిమ గోదావరి మధ్య జరిగిన పోటీలో 24 పాయింట్లతో ఇబ్రహీంపట్నం జట్టు విజయకేతనం ఎగురవేసింది. విజయనగరం – తూర్పుగోదావరి మధ్య జరిగిన పోటీలో 18:పాయింట్లతో విజయనగరం విజయం సాధించింది. గురువారం జరిగే సెమీ ఫైనల్స్ కు ఏ 1 ఇబ్రహీంపట్నం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జట్లు అర్హత సాధించాయి.

Leave a Reply