20 ఏళ్ల సేవ చేసినా న్యాయం లేదు..

20 ఏళ్ల సేవ చేసినా న్యాయం లేదు..

  • రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల పోరాటం
  • స్టేషన్ ఘన్ పూర్ లో మూడో రోజుకు చేరుకున్న సమ్మె
  • కార్మికుల సమ్మెకు పలు పార్టీల మద్దతు
  • హామీలు అమలు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
  • ఆర్టిజన్, ఆన్‌మ్యాన్డ్, స్పాట్ బిల్లర్లు, పీస్‌రేట్ కార్మికుల ఆవేదన

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : గత రెండు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవు ట్‌సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా వారి జీవితా లతో చెలగాటమాడుతోందని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్(జేఏసీ)ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన సమ్మె కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా స్టేషన్ ఘన్‌ పూర్ పట్ట ణ కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట కొనసాగుతున్న సమ్మె శుక్రవారం మూ డోవ రోజుకు చేరుకుంది.

ఈ సమ్మెకు పలు పార్టీలు సీఐటీయూ, సిపిఐ, బిఎస్ పి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ…ఉమ్మడి రాష్ట్ర కాలంలో 23 వేల మందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. అందులో పలువురు మరణించ గా, మరికొందరు రిటైర్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం మిగిలిన 18 వేల మందికి న్యాయం చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీఐ, ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. ఒకే సంస్థలో పని చేస్తున్న వారందరికీ సమాన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్, ఆన్‌ మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం:

తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ పాశం రాజు, కన్వీనర్ బాధవత్ లక్ష్మణ్, కో చైర్మన్ విరగోని లక్ష్మ ణ్ గౌడ్‌లు హెచ్చరించారు. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేయి స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని మండిపడ్డారు.

ఆర్టిజన్ల కన్వర్షన్, ఆన్‌మ్యాన్డ్ కార్మికులకు గుర్తింపు, ఏపీఎస్‌ఈబీ నిబంధనల అమలు, గృహజ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులకు రక్షణ, పీస్‌రేట్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉబ్బని వెంకటస్వామి, గుర్రం సురేష్(డాన్ ), ఎస్ రమ్య, సరిత, లత, అశోక్, లక్ష్మణ్, అరుణ్, ఇట్ట బోయిన శ్రీను, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply