Julurupadu : సైబర్ నేరాలపై అవగాహన…
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా మెలగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల వలన జరుగుతున్న మోసాలపై పోలీసులు ప్రజలకు అవగాహనా కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో(police station) విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్(DSP Abdul Rehman), జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ, ఎస్ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

