Jubilee Hills | నరాలు తెగే ఉత్కంఠ..

Jubilee Hills | నరాలు తెగే ఉత్కంఠ..

Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ -ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. అందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకటో నెంబర్ పోలింగ్ బూత్ షేక్ పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్ తో కౌంటింగ్ ముగియనుంది. పోలింగ్ పూర్తైన తర్వాత భారీ భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగిసే అవకాశం ఉంది. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

మొత్తం 10 రౌండ్స్ లో పూర్తి ఫలితాలు తేలనున్నాయి. ఒక్కో టేబుల్ దగ్గర ముగ్గుర అధికారులు కౌంటింగ్ లో పాల్గొననున్నారు. అభ్యర్ధులు, వారి ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను (EVM) తీసుకువచ్చి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఒక్కటి కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో ముందుగా హామ్ ఓటింగ్ ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రౌండ్ పూర్తైన వెంటనే ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ లో ఫలితాన్ని అప్ లోడ్ చేయనున్నారు.

Leave a Reply