భూపాలపల్లి, జులై 21(ఆంధ్రప్రభ): జర్నలిస్టులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం భూపాలపల్లి (Bhupalpalli) జర్నలిస్టులు (Journalists) కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ సెంటర్ (Ambedkar Center) ప్రధాన కూడలిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రోడ్డు పై బైటాయించి ప్లకార్డులతో ధర్నా నిర్వహించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేటి మంత్రుల పర్యటన ప్రోగ్రామ్ కవరేజ్ ను కూడా బహిష్కరించినట్లు జర్నలిస్టులు పేర్కొన్నారు.
