Journalists | చలో విజయవాడ ను జయప్రదం చేయండి..

Journalists | చలో విజయవాడ ను జయప్రదం చేయండి..

ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు


Journalists | శ్రీకాకుళం,ఆంధ్రప్రభభ: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు తెలిపారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాలు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. నగరంలో స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ, దేశంలో పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛను సౌకర్యం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు సదుపాయం కల్పించాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ఉచిత విద్య కల్పించాలని కోరారు.

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు అవార్డులు అందించడంతోపాటు వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు వద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ జర్నలిస్టుల సంఘం ( ఎన్ ఎ జె)కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘకాలంగా తమ సంఘం పోరాడుతుందని జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు సమష్టిగా పనిచేస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టడం శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘం పనిచేస్తుందని గతంలో కూడా ఛలో విజయవాడ, సమావేశాలకు శ్రీకాకుళం జిల్లా నుండి పెద్దఎత్తున జర్నలిస్టుల హాజరైన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికల్లో, లోకల్ టీవీ ఛానెళ్లల్లో పనిచేసే జర్నలిస్టులకు నియోజకవర్గానికి ఒకటి, జిల్లా కేంద్రంలో డెస్క్ జర్నలిస్టులకు గతంలో అక్రిడిటేషన్లు ఇచ్చేవారని, అదే పద్ధతిని అవలంభించాలని కోరారు. మీడియా అకాడమి గవర్నింగ్ బాడీలో అన్ని జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, జర్నలిస్టులందరికీ రైల్వే పాసులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలోను జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని చెబుతూ ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారన్నారు.

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివుని కష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ, జి .శ్రీనివాస్ రావు ఏపీబీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇ.ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మణరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా బాధ్యులు సువ్వారి మురళీధర్, డి.ఆనందరావు, తోట భీమారావు, బగాది వాసుదేవరావు, జి.నర్సింగరావు, బేరి చిన్నారావు, బహదూర్‌భాషా, ఎస్.విజయ్‌కుమార్, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు ఎస్.జోగినాయుడు, జి.షణ్ముఖరావు, ఒంపూరు రమేష్, రాధాకుమారి, రౌతు సూర్యనారాయణ, గంజి ఆర్.ఎజ్రా, కిల్లి శ్రీను, ఎం.సుదర్శన్, డి.హేమసుందర్, భాసూరు సాయి, సీపాన రమేష్, కె.కొండబాబు, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంజనేయులును ఎన్జీజీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతుసాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, చల్లా శ్రీనివాస్, శ్రావణి, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ కొంక్యాన మురళీధర్ శాలువా కప్పి సత్కరించారు.

Leave a Reply