Journalism | ఘనంగా ‘ఆంధ్రప్రభ’ క్యాలెండర్ ఆవిష్కరణ…

Journalism | ఘనంగా ‘ఆంధ్రప్రభ’ క్యాలెండర్ ఆవిష్కరణ…
- ఆవిష్కరించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబు, సర్పంచ్ శ్రీలత
Journalism | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండల కేంద్రంలో ‘ఆంధ్రప్రభ(Andhraprabha)’ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరిగింది. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబు, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమారి శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రభ పత్రిక విలువలతో కూడిన జర్నలిజం(Journalism) చేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ.. పత్రికలు సమాజానికి అద్దం పడతాయని, ఆంధ్రప్రభ నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు చేరువకావడం సంతోషకరమన్నారు. నూతన సంవత్సరంలో ఆంధ్రప్రభ మరెన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు, ఆంధ్రప్రభ మండల ప్రతినిధి నూతి ప్రణయ్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
