Joint collector | గోధుమ పిండి పంపిణీ..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రేషన్ డిపోల ద్వారా బియ్యం, పంచదారతో పాటు అధిక పోషక విలువలు కలిగిన చక్కి గోధుమ పిండిని జనవరి 2వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. కేజీ చక్కి గోదుమ పిండి రూ.20లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

