Joined | బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి …

Joined | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కర్నె గంగయ్య (మాజీ వార్డు సభ్యులు) ఈ రోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్బంగా గంగయ్యకు ముత్యాల సునిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మున్సిపల్ గద్దె మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందెల ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, ముచ్కూర్ సొసైటీ మాజీ అధ్యక్షులు బంగ్లా దేవేందర్, నల్లూరి శ్రీనివాస్, నల్లూరి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply