JEE Main | ప్రొవిజినల్ కీ విడుదల

JEE Main | ప్రొవిజినల్ కీ విడుదల
JEE Main | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జేఈఈ మెయిన్ 2026 (సెషన్-1) ప్రొవిజినల్ ఆన్సర్ కీ బుధవారం విడుదలైంది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు JEE Main పరీక్షలు జరగ్గా.. పేపర్ -1కు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ (NTA) అధికారులు బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కీపై నేటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11.50గంటల వరకు అభ్యంతరాలుంటే తెలపవచ్చన్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొవిజినల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపడానికి అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
