JEE Advanced |రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు

కాన్పూర్‌ ; దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. జూన్‌ 2న ఉదయం 10 గంటలకు తుది కీతోపాటు ఫలితాలను ఐఐటీ కాన్పూర్‌ విడుదల చేయనుంది

మే 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.80 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తున్నది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గత ఏడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు.

ప్రస్తుతం ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://jeeadv.ac.in/లో ఫలితాలు చూడవచ్చు.

Leave a Reply