Janhvi Kapoor| హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి

Janhvi Kapoor| హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌ లో అతిలోక సుందరిగా చిరస్థాయిగా నిలిచిన శ్రీదేవి కుమార్తె, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఒకప్పుడు తెలుగు సహా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన అందం, అభినయంతో శాసించిన శ్రీదేవి వారసత్వాన్ని జాన్వీ కపూర్ కొనసాగించగలని చూస్తుంది. బాలీవుడ్‌ లో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌ పై పూర్తి దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. తెలుగులో ఆమె తొలి చిత్రం దేవర కాగా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మంచి గుర్తింపు అందుకుంది. డెబ్యూతో హిట్ కూడా సాధించారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రంలో కూడా జాన్వీ హీరోయిన్‌ గా ఎంపిక కావడం విశేషం. పెద్ది మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండగా, టాలీవుడ్‌ లో ఆమెకు అవకాశాలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply