Jan 20 | బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నిక: పార్టీ భవిష్యత్‌కు కీలక ఘట్టం

జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక
పార్టీ అధ్యక్ష పదవికి పెరిగిన ప్రాధాన్యం
సంఘ్ నేపథ్యం, అనుభవానికి పెద్దపీట
2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన
దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారా?
ఏకగ్రీవ నిర్ణయానికి అవకాశం
Jan 20 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీలో జనవరి 20 న జరగనున్న నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన పార్టీ, బీజేపీకి రాబోయే లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీలోని అంతర్గత సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా కీలకం.
ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడి పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. అందుకనే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలను, స్థానిక నేతలను ఏకతాటిపై నడిపిస్తూ, రాబోయే ఎన్నికలకు పార్టీని తీసుకువెళ్ళేలా పార్టీకి దిశానిర్దేశం చేసే కీలక పదవి పార్టీ అధ్యక్ష స్థానం. తిరిగి ఈ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది, బీజేపీ భవిష్యత్ వ్యూహాలను ప్రతిబింబిస్తుంది.
Jan 20 | సంఘ్ నేపథ్యం, అనుభవానికి ప్రాధాన్యం
బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో సాధారణంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెసెస్) నేపథ్యం, పార్టీకి చేసిన సుదీర్ఘ సేవలు, రాజకీయ అనుభవం కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం ఎన్నికల్లో సాధించిన విజయాల ప్రాతిపదికన మాత్రమే కాకుండా, పార్టీ శ్రేణులను సమన్వయం చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడికే అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తర, దక్షిణ భారత దేశం నుండి వెనుకబడిన వర్గాలు, మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం వంటి అంశాలు కూడా ఈసారి కీలకంగా మారనున్నాయని పార్టీ పరిశీలకుల అభిప్రాయం.
Jan 20 | 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన
బీజేపీకి నూతన అధ్యక్షుడు కేవలం పార్టీ పరిపాలనకే కాకుండా, 2029 లో రాబోయే లోక్‌సభ ఎన్నికల విజయమే లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాల్సిన బాధ్యత స్వీకరించాల్సి ఉంటుంది. అంతేకాక రాష్ట్రాల వారీగా పార్టీ బలోపేతం, కొత్త ఓటర్ వర్గాలను ఆకర్షించడం, యువత, మహిళలపై ప్రత్యేక దృష్టి వంటి అనేక అంశాలు కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్లు.

అలాగే, ప్రతిపక్షాల ఐక్యతకు ఎప్పటికప్పుడు గమనిస్తూ, అంచనా వేస్తూ, వారు బలపడకుండా, అంతకంటే బీజేపీని మరింత బలమైన రాజకీయ శక్తిగా నిరంతరం నిలబెట్టడం రాబోయే అధ్యక్షుడి కీలక బాధ్యత.
Jan 20 | ఈసారి దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారా
ఇటీవలి కాలంలో దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణ,రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడంపై పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పిస్తారా, లేక ఉత్తర భారత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడినే ఎంపిక చేస్తారా, అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ విషయంపై అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది.
ఈ అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం పార్టీ వ్యూహాత్మకతను స్పష్టంగా తెలిపనుంది.
Jan 20 | ఏకగ్రీవ నిర్ణయానికి అవకాశం
బీజేపీ అధ్యక్ష ఎన్నికలు సాధారణంగా పోటీకి దూరంగా, ఏకగ్రీవ నిర్ణయంతోనే పూర్తవుతుంటాయి. ఈసారి కూడా పార్టీ అధిష్ఠానం, సంఘ్ పెద్దల సమన్వయంతో ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందా అంటే, అవుననే అనిపిస్తోంది. అలాంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే, ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశం మాత్రం చివరి వరకూ ఉత్కంఠగానే కొనసాగనుంది.
బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నిక కేవలం ఒక పదవి భర్తీ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది పార్టీ భవిష్యత్ రాజకీయ దిశను, వ్యూహాలను నిర్ణయించే కీలక ఘట్టం. కొత్త నాయకత్వం పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో విజయపథంలో నడిపిస్తుందా? అన్నది కాలమే నిర్ణయించనుంది.
BJP new president election
BJP national president
BJP leadership change
RSS role in BJP
BJP future strategy
2029 Lok Sabha elections
BJP organizational elections
BJP internal politics
BJP South India strategy
BJP party president news
click here to read 364.5MillionDollars | చమురు ధరలపై ప్రభావముంటుందా?
