ముగ్గురికి శిక్ష.. కరీంనగర్ తరలింపు
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల (Drunk and drive checks) లో 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిని ఈ రోజు గోదావరిఖని రెండో అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ ఎదుట హాజరుపరచగా, వారిలో ఆరుగురికి రూ.12,000 జరిమానా విధించారు.
రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మూడోసారి అదే నేరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ షేక్ కమ్మరుద్దీన్ అనే వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. శిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బీ. రాజేశ్వరరావు (Traffic Inspector B. Rajeshwara Rao) మాట్లాడుతూ… మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా నిరోధక చర్యలు కఠిన తరం చేసినట్టు తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే మద్యం మత్తు డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమని, ఇలాంటి డ్రైవింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

