ఎమ్మెల్యే ని కలిసిన జగ్గయ్యపేట సర్పంచ్..

రేగొండ, ఆంధ్రప్రభ: గోరికోత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట గ్రామానికి కాంగ్రెస్ తరఫు సర్పంచ్ అభ్యర్థిగా నడిపెల్లి శాంతాదేవి–వెంకట్రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును ఆయన పర్యవేక్షణ శిబిరంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు.

జగ్గయ్యపేట సర్పంచ్ అభ్యర్థి శాంతాదేవి–వెంకట్రావును ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మటిక సంతోష్, లెంకలపల్లి రవి, పొనుగోటి వీరబ్రహ్మం, పాతపల్లి సంతోష్, ముడుపు అశోక్ రెడ్డి, అమ్ముల సదయ్య, గంటే మహిపాల్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply