Jagan | అధికారంలోకి రావడం తథ్యం..

Jagan | అధికారంలోకి రావడం తథ్యం..

Jagan | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం ప్రజా సేవలోనే వైసీపీ ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress Party) జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం శ్రేణులు వైభవంగా నిర్వహించారు. నగరంలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ముందుగా జగన్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కేక్ కట్ చేశారు. అనంతరం భారీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన వైసీపీ శ్రేణులు, అభిమానులను దేవినేని అవినాష్ ప్రశంసించారు.

Jagan

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ (Devineni Avinash) మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు జగన్ పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో రెండు వందల మంది రక్తదానం చేశారని, దేశంలోనే అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న నేత జగన్ మాత్రమే అన్నారు. జగన్ రోడ్ మీదకి వస్తే లక్షల్లో ప్రజలు వస్తారని, సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, వైయస్సార్, జగన్ మాత్రమే అన్నారు. ఆయనతో రాజకీయ జీవితం గడుపుతున్నందుకు ఆనందంగా ఉందని, జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చి బాబు, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, కో అప్షన్ మెంబర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయిలో పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply