AP | క‌ర్నూలులో ఎండ‌మంట‌లు.. ఇప్ప‌టికే 38డిగ్రీలు

మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరి జిల్లా కుంతలంలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

సాధారణంగా మహాశివరాత్రి అనంతరం చలికాలం పూర్తిగా తగ్గిపోయి.. ఎండలు మొదలవ్వాలి.. కానీ ఈ సంవత్సరం ముందస్తుగా భారీ ఎండలు కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *