Press conference | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేసిన అనుచిత వ్యాఖ్యలను నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవాళ నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో (In the camp office) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ (Jukuri Ramesh) లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూటికి నూరు శాతం బీసీల పక్షపాతి అన్నారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామపంచాయతీ నుండి బీఆర్ఎస్ (BRS) తరపున సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన మామిడి నాగలక్ష్మి భర్తను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించడం సిగ్గుమాలిన చర్యగా వారు అభివర్ణించారు.
స్నేహితులతో మద్యం తాగడానికి వెళ్లిన యాదగిరి తన భార్యను నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ నాయకులు తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలు (Torture) పెట్టారని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. యాదగిరికి మొదటి నుండి మతిస్థిమితం లేదని గ్రామస్తులు చెబుతున్నారని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ (kidnap) చేయడం వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) హస్తం ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించడం సరైంది కాదన్నారు.
తీన్మార్ మల్లన్న వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రిపై తప్పుడు ఆరోపణలు (False accusations) చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహకారం వల్లే బీసీ అయిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన మాట వాస్తవం కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు (questioned). నల్లగొండ నియోజకవర్గంలో నూటికి 70శాతంకు పైగా సర్పంచ్ స్థానాలకు బీసీ అభ్యర్థులను (Candidates of BC) ప్రకటించిన గొప్ప నాయకుడు కోమటిరెడ్డి అని వారు చెప్పారు. యాదగిరి తాను కిడ్నాప్ అయినట్లు చేసుకుంటున్న ప్రచారం అంతా పొలిటికల్ డ్రామా అని వారు వ్యాఖ్యానించారు.

