హైదరాబాద్ – దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటి సోదాలు చేపట్టారు.. తెలంగాణ , ఏపీ , ఢిల్లీ , ముంబై , బెంగుళూరు , చెన్నై లో ఏకకాలంలో ఐటి అధికారులు నేటి ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా నీట్, జేఈఈ వంటి పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఈ కళాశాలల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి భారీగా ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకకాలంలో దేశంలోని పలు నగరాలలో ఉన్న ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. అదేవిధంగా పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
IT Raids | దేశ వ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థలపై ఐటి దాడులు
