ఐటీ అంటే ఇకనుంచి వైజాగ్‌

ఐటీ అంటే ఇకనుంచి వైజాగ్‌

ఏపీకి ప్రారంభమైన పెట్టుబడుల ప్రవాహం
నకిలీ మద్యం కేసులో ఎంతటి వారికైనా శిక్ష తప్పదు
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : వైజాగ్‌కు గూగుల్ సెంటర్ (Google Center ) రావడం దేశానికే గర్వకారణమైతే ఏపీకి మరో సువర్ణధ్యాయం అని శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంద‌ని పేర్కొన్నారు. విజయవాడ (Vijayawada) లోని శాప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్టుబడి పెడతాం అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు గుర్తుకు వచ్చేవని, రానున్న రోజుల్లో వైజాగ్ ఐటీ హబ్ గా నిలుస్తుందన్నారు.

గూగుల్ డేటా సెంటర్ ఎనౌన్స్ చేయగానే రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారని, కానీ రాష్ట్ర వినాశనం కోరుకునే వారు మాత్రమే వ్యతిరేకం గా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైజాగ్ (Visakhapatnam) లో ఈ గూగుల్ సెంటర్ తో ప్రత్యక్షం గా పరోక్షంగా లక్షల మంది ఉపాధి పొందుతారని, దేశానికే తలమానికంగా విశాఖ లో గూగుల్ నిలవనుందన్నారు. పరిశ్రమలను ఎవరు ఆపలేరు అన్నారు. కర్నూలు లో జీఎస్టీ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. న‌కిలీ మ‌ద్యం పాపం వైసీపీదే అని, మద్యం కుంభకోణంలో ఎవరు ఉన్నా వదిలేది లేదన్నారు., నకిలీ మద్యం తయారుచేసే జనార్ద‌న్ ఇప్పటికే జైలు కు వెళ్లాడని, ఇంకా ఎవరైతే నకిలీ మద్యం లో పాత్ర ఉందో అంద‌రూ జైలు కు వెళ్లడం ఖాయమన్నారు.

Leave a Reply