IT Department | ఘ‌నంగా నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

IT Department | ఘ‌నంగా నారా లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

IT Department | ఉయ్యూరు – ఆంధ్రప్రభ : విద్య, ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఉయ్యూరు టౌన్, మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎంఎల్సి రాజేంద్రప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, ప్రజాసేవే ప్రతిక్షణం ఆలోచనగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నారా లోకేష్ బాబు ఆలోచనలు ఉంటాయని, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తూనే, విద్యాశాఖ మంత్రిగా విద్యకు టెక్నాలజీని జోడిస్తూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని, మరోపక్క కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి కార్యకర్తలు అండగా నిలవడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు.

IT Department |

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాథరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నిగళ్ల కుటుంబరావు, ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, క్లస్టర్ ఇంచార్జ్ కూనప రెడ్డి వాసు, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, తెదేపా నాయకులు రత్నం బుజ్జి, జంపన వీర శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, కౌన్సిలర్ పల్యాల శ్రీనివాస్, కోరాడ లక్ష్మి, శివాలయం చైర్మన్ కిషోర్, మండల, టౌన్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply