మంత్రికి ఇస్కాన్ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్ : ప్రజాభవన్ లో మంత్రి సీతక్క (Minister Seethakka) ను ఇస్కాన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి మార్గం కల్పించాలని మంత్రి సీతక్కకి ఇస్కాన్ (ISKCON) బృందం విజ్ఞప్తి చేసింది. నేరెళ్లలో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల శిక్షణ, సోలార్ విద్యుత్, సాలిడ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇస్కాన్ చేపట్టనుంది.

ఆ ప్రాజెక్ట్ కు రహదారి వసతి (Road Request) కల్పించాలని వారు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. దీనికిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఇస్కాన్ ప్రాజెక్టు (ISKCON Project) కు రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్ ఈఎన్సీ (PR ENC) కి ఆదేశాలు జారీ చేశారు.


కామారెడ్డి (Kamareddy) వరద బాధితుల కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ (Infosys Foundation) ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్ల (kits) ను పంపిణీ చేయడానికి సిద్ధమైన ఫౌండేషన్‌ను ఇన్చార్జ్ మంత్రి సీతక్క అభినందించారు. ఆపద సమయంలో సహాయం అందిస్తున్నందుకు ఫౌండేషన్ ప్రతినిధులు (Foundation representatives) వంశీ, వినోద్‌లను ప్రజా భవన్‌లో సీతక్క ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply