వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌పై అక్ర‌మ కేసులు పెట్టి తిహాడ్ జైలు (Tihar Jail) కు పంపార‌ని, తాను జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గ‌త ఏడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత (Kavitha) తెలిపారు. గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశామన్నారు.

తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినపుడు గళమెత్తినట్లు చెప్పారు. బనకచర్ల (Banakacharla), భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాల పై రౌండ్ టేబుల్ సమావేశాలు (Round table meetings) నిర్వహించినట్లు తెలిపారు. సీఎం సొంత జిల్లాలో భూనిర్వాసితులకు అండగా ఉన్నామని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలుపుకొని.. గులాబీ కండువాలతో అనేక ప్రజాసమస్యలపై మాట్లాడామన్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై భారత రాష్ట్ర సమితి (BRS) పెద్దలు పునరాలోచన చేయాలన్నారు.

Leave a Reply