అదే కారణమా…

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం.. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో 41 ప్రయాణిస్తున్నారు.
24 వ తేది (శుక్రవారం ) తెల్లవారుజామున 3, 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొంది.
ఈ బైక్ బస్సు కిందకు పోయింది. ఇంధనం లీక్ కావడంతో మంటలు రేగాయి.
కేబుల్ కట్ కావటంతో బస్సు డోర్ తెరచుకోలేదు. పల్సర్ బైక్ మీద వెళ్తున్న కర్నూలు ప్రజానగర్ కు చెందిన శంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెండాడు.
బస్సులో మంటలు రేగటంతో ప్రయాణికులు ఉలిక్కి పడ్డారు.
బయటకు రాలేని స్థితిలో అద్దాలు పగల గొట్టుకుని 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

Leave a Reply