Iran| మోగిన వార్ సైరన్

Iran| మోగిన వార్ సైరన్
విరుచుకుపడుతున్న ఇరాన్
ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులు
దెబ్బతిన్న దుబాయ్ విమానశ్రయంపై డ్రోన్‌దాడి
యూఏఈ, ఖతార్‌లలో అనేకచోట్ల భారీ పేలుళ్లు
అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌పై విధ్వంసకర దాడులకు దిగుతామన్న ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల సైరన్లు మోగాయి. దుబాయ్ ఎయిర్‌పోర్టును మరోసారి ఇరాన్ డ్రోన్ తాకింది. ఇరాన్ డ్రోన్ దాడిలో దుబాయ్ విమానాశ్రయం దెబ్బతింది. యూఏఈ, ఖతార్‌లలో అనేకచోట్ల భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్ క్షిపణి పడింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలు ఇరాన్ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్ల మోత మోగింది.
