Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha News

Iran Supreme Leader Alive : జన్బాజ్ బ‌చ్ గ‌యా Andhra Prabha News

  • వీడిన ముజ్త‌భా మిస్ట‌రీ
  • వైమానిక దాడిలో తీవ్ర గాయాలు
  • కోలుకుంటున్న సుప్రీం లీడర్
  • అధికారులతో ఆడియో సమావేశాలు
  • అంతరంగికుల లీక్‌తో వెలుగులోకి నిజాలు
  • ఇరాన్‌లో నాయకత్వంపై సందేహాలు
  • అమెరికాతో శాంతి చర్చల కీలక దశ
  • ఖమేనీ ఆరోగ్యంపై అధికారిక మౌనం
  • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు

(ఆంధ్ర ప్ర‌భ , దుబాయ్ ప్ర‌తినిధి)

Iran Supreme Leader Alive

Iran Supreme Leader Alive : ఇరాన్ కొత్త సుప్రీం లీడ‌ర్ ముజ్తభా ఖ‌మేనీ.. చ‌నిపోయాడా? బ‌తికి ఉన్నాడా? ఉంటే ఏ స్థితిలో ఉన్నాడ‌నే మిస్ట‌రీ వీడిపోయింది. ఇటీవ‌ల ఇరాన్ ఆర్మీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు వ‌చ్చి యుద్ధాన్ని ప‌ర్య‌వేక్షించార‌ని ఇరాన్ మీడియా ప్ర‌చారం చేయ‌గా.. లేదు.. అత‌డు అప‌స్మార‌క స్థితిలో ఉన్నాడ‌ని ఇజ్రాయెల్ మీడియా ఘంటాప‌థంగా చెప్పాయి. తాజాగా.. యుద్ధం ఆరంభంలో వైమానిక దాడిలో ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలైన ఇరాన్ నూతన సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ కోలుకుంటున్నారని, ఆయన సన్నిహిత వర్గాల నుంచి స‌మాచారం మీడియాకు లీకైంది. టెహ్రాన్ నగర మధ్యభాగంలోని సర్వోన్నత నాయకుడి నివాసంపై జరిగిన దాడిలో ఖమేనీ ముఖం వికృతంగా మారిందని, ఆయన ఒకటి లేదా రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని స‌న్నిహిత బంధువులు తెలిపారు.

Iran Supreme Leader Alive

Iran Supreme Leader Alive : సున్నిత అంశాల‌ను చర్చించడానికి తమ పేర్లు వెల్లడించ వద్దని ఆ కుటుంబ స‌భ్యులు ప్రాధేయ ప‌డ్డారు. ఖ‌మేనీ గాయాల నుండి కోలుకుంటున్నారు. మానసికంగా చురుకుగా ఉన్నారు. ఆయన ఆడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉన్నతాధికారులతో సమావేశాలలో పాల్గొంటున్నారు. యుద్ధం, వాషింగ్టన్‌తో చర్చలతో సహా ప్రధాన సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఖ‌మేనీ బంధువ‌లు తెలిపారు. శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికాతో అత్యంత కీలకమైన శాంతి చర్చలు జ‌రుగుతున్న త‌రుణంలో దశాబ్దాలుగా ఇరాన్ అత్యంత తీవ్ర ప్రమాదంలో ఉంది. ఇలాంటి స్థితిలో దేశ వ్యవహారాలను నడపడానికి ఖమేనీ ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ALSO READ : China Garage : శాంతి బురఖా Andhra Prabha Top Story

Leave a Reply