ఐకూ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఐకూ Z10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఐకూ Z10, ఐకూ Z10x 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐకూ భారీ బ్యాటరీ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 52 గంటల వరకు కాల్స్ మాట్లాడుకోవచ్చు. భారీ బ్యాటరీని కలిగిన ఉన్నా.. ఈ ఫోన్ 199 గ్రాముల బరువుతో 7.89 mm థిక్‌నెస్‌తో విడుదల అయింది.
డిస్‌ప్లే :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ (1080*2392 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 387 ppi పిక్సల్ డెన్సిటీ ని కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ పొందవచ్చు.
కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలన కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాలను అమర్చారు.
ఈ ఫోన్ AI Erase, AI సూపర్ డాక్యుమెంట్, AI సర్కిల్ టూ సెర్చ్, AI నోట్ అసిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, BeiDou, Glonass, USB-C వంటి అనేక ఫీచర్‌లున్నాయి.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, గైరో స్కోప్, ఈ- కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ లతోపాటు ఇన్‌ప్రారెడ్ బ్లాస్టర్, భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు ఆఫర్లు, EMI ఆప్షన్‌లతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
కాగా, ఐకూ Z10 ఫోన్ సేల్ ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఐకూ ఇండియా స్టోర్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రిటైల్ బాక్స్‌లో ఫోన్‌తోపాటు ఛార్జర్, USB కేబుల్, ఫోన్ కేస్, ప్రొటెక్టివ్ ఫిల్మ్ ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.