లక్నో – లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దారిత 20 ఓవర్లలో ఆరు వికెట్ట నష్టానికి 180 పరుగులు చేసింది.. లక్నో ఈ మ్యాచ్ గెలవాలంటే 281 పరుగులు చేయాల్సి ఉంది. టాస్ ఓడిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(53), సాయి సుదర్శన్(51)లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ తొలి వికెట్‌కు 120 రన్స్ జోడించి పటిష్ట స్థితిలో నిలిపాడు. సుదర్శన్ సైతం అతడిని అనుసరించడంతో గుజరాత్ జోరుకు బ్రేక్ పడింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై చితక్కొట్టిన వాషింగ్టన్ సుందర్‌ను బిష్ణోయ్ బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు. ఇక 16 పరుగులు చేసిన జోస్ బట్లర్ దిగ్వేష్ రఠి చేతికి చిక్కాడు..
ఆ తర్వాత రూథర్ ఫోర్డ్ ని శార్దూల్ ఠాకూర్ అయిదో వికెట్ గా పెవిలియన్ కు చేర్చాడు.. రూథర్ పోర్డ్ 22 పరుగులు చేశాడు.. ఇక అదే ఓవర్ లో తేవాటియాను సున్నా పరుగులకు శార్డూల్ ఔట్ చేశాడు… షారూక్ ఖాన్ 11 పరుగులు , రషీద్ ఖాన్ 4 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.. లక్నో బౌలర్స్ లో రవి బిష్ణోయ్ కు మూడు వికెట్లు, శార్దూల్ కు రెండు వికెట్లు లభించగా, దిగ్వేష్ కి ఒక వికెట్ దక్కింది..