ipl 2026| ఇవాళ డ‌బుల్ హెడ‌ర్‌

ipl 2026| ఇవాళ డ‌బుల్ హెడ‌ర్‌

దుమ్ము దులిపే మ్యాచ్‌లు
మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ – హైదరాబాద్
రాత్రి 7.30గంట‌ల‌కు చెన్నై – ఢిల్లీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఈ రోజు పండ‌గే. వీకెండ్ శనివారం రోజున ఫుల్ మ‌స్తీ ఇచ్చే మ్యాచులు ఉన్నాయి. వీకెండ్‌లో (శ‌నివారం) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు ఇవాళ ఐపీఎల్ కిక్కు అందడం ఖాయమని చెప్పొచ్చు. ఇవాళ బిగ్ మ్యాచులు ఉండ‌టంతో అభిమానుల‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్ మధ్యాహ్నం నుంచే టీవీలకు అతుక్కుపోవ‌డం ఖాయమ‌ని చెప్ప‌వ‌చ్చు. ముల్లాన్‌పూర్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. జరగనుంది. ఇక రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్లు ఢీకొనున్నాయి. రెండు మ్యాచుల్లో ఆడే జ‌ట్లు భీక‌ర‌మైన బ్యాటింగ్, బౌలింగ్ లైన‌ప్ ఉండ‌టం హోరాహోరీ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

మ‌ధ్యాహ్నం పంజాబ్‌, హైద‌రాబాద్ ఢీకొన‌నున్నాయి. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తోంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సన్‌రైజర్స్ మాత్రం పడుతూ లేస్తూ ఇబ్బందులు ప‌డుతోంది. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడితే అందులో రెండు విజయాలు సాధించగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంటే ఈ సీజన్‌లో పంజాబ్‌కి ఇప్పటి వరకు ఓటమే లేదు. ఇక సన్‌రైజర్స్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటే గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో ఉంది.

రాత్రి 7.30 గంట‌ల‌కు ఢిల్లీతో సీఎస్కే త‌ల‌ప‌డ‌నుంది. గ‌తేడాది మాదిరిగానే ఈసారి కూడా చెన్నై చ‌తికిల‌ప‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచులు ఆడ‌గా ఒక్క విజ‌యం కూడా సాధించ‌లేక‌పోయింది. ఐపీఎల్2025లో అట్టడుగు స్థానానికి పడిపోయిన చెన్నై.. ఈ ఏడాది కూడా అదే ప‌రిస్థితి ఏర్ప‌డేలా ఉంది. ఇప్ప‌టికైనా విజృంభించ‌క‌పోతే టేబుల్ లాస్ట్ ఉండే ప్ర‌మాద‌ముంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో అయినా గెలిచి ఖాతా తెర‌వాల‌ని చెన్నై చూస్తోంది.

Leave a Reply