కోల్‌కతా : ఐపీఎల్‌లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కేకేఆర్‌కి చాలా కీలకం. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో ఇరు జట్లు ఓ మ్యాచ్‌లో తలపడితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లలో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుదే పైచేయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ఐపీఎల్ 2025 నుంచి ఎలిమినేట్ కాగా, కేకేఆర్‌కి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడానికి ఇంకా అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది.. లేకపోతే ఆశలు పోయినట్లే. హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా అందులో కోల్‌కతా విజయం సాధించింది.