IPL 2025 | గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్!

ఐపీఎల్ 2025లో మంచి జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీజ‌న్ ఐపీఎల్ నుంచి వైదొలిగి తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గుజరాత్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది.

గుజరాత్ తరపున రబాడ మొదటి రెండు మ్యాచ్ లు ఆడిన రబాడ‌… పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‪లో రబాడ 41 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రబాడ బ‌రిలోకి దిగలేదు. రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ ఆడాడు. టాస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల రబాడ ఆడటం లేదని చెప్పాడు.

ముంబై ఇండియన్స్, ఆర్సీబీలను ఓడించిన తర్వాత ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. గుజరాత్ జట్టులో ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరితో పాటు ఇషాంత్ శర్మ, గుర్నూర్ బ్రార్, కుల్వంత్ ఖేజ్రోలియా కూడా జట్టులో ఉన్నారు. గుజరాత్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 6న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.

Leave a Reply