ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు జైపూర్‌లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలు ధరించి బరిలోకి దిగనున్నారు. 2011 నుంచి పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే.. ప్రతి సీజన్లో ఆర్‌సీబీ ఒక మ్యాచ్‌ను గ్రీన్ జెర్సీతో ఆడటం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రేపటి మ్యాచ్ లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో మ్యాచ్ ఆడనుంది. రేపు టాస్ సమయంలో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ‘గో గ్రీన్’ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ కెప్టెన్ సంజు సామ్సన్‌కు ఒక మొక్కను బహూకరిస్తాడు.