ఆధ్యాత్మికత పరిమళించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి….

ఆధ్యాత్మికత పరిమళించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి….

సకలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ టీడీపీ రైతు నేత గవిని శివరామకృష్ణ ప్రమాణ స్వీకారం.. మోపిదేవి

కృష్ణా, ఆంధ్ర‌ప్ర‌భ : ఆధ్యాత్మికత పరిమళించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్షించారు. మంగళవారం మోపిదేవిలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సకలేశ్వర స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది.

దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి చైర్మనుగా టీడీపీ రైతు నేత గవిని శివరామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి నూతన డైరెక్టర్లుగా బెల్లంకొండ ఏడుకొండలు, కొలుసు నాగమణి, చిక్కాల నాగరాజు, రాజనాల సుధారాణి, మోపిదేవి వెంకట సుబ్బారావు, పెనుమూడి సీతామహాలక్ష్మి, మోటేపల్లి బేబీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన పాలకమండలి ఆహ్వానం మేరకు ఈ వేడుకకు అతిధులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ మోపిదేవిలో ప్రాచీన చరిత్ర కలిగిన మహిమాన్విత దేవస్థానంగా భక్తుల పూజలు అందుకుంటున్న సకలేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలని కోరారు. ప్రాచీన దేవస్థానాలకు నిలయమైన దివిసీమలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విస్తృత కృషి చేస్తున్నారని తెలిపారు.

వ్యవసాయ ఆధారమైన ఈ నియోజకవర్గంలో ప్రాచీన ప్రఖ్యాతి కలిగిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు అనువైన అవకాశాలు గుర్తించి పలుమార్లు అసెంబ్లీ ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు అనువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేసి ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇప్పటికే నియోజకవర్గంలో అనేక దేవస్థానాలను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో సీజీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి కృషితో దేవస్థానం ఖ్యాతి పెరగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, ఎంపీటీసీ కొమ్ము పవన్, మండల కో-ఆప్షన్ సభ్యులు చందన రంగారావు, మాజీ సర్పంచులు దిడ్ల జానకీ రాంబాబు, అరజా సంధ్యారాణి, దిడ్ల జానకి రాంబాబు, దొప్పలపూడి గంగాభవానీ, పోలిమెట్ల ఏసుబాబు, సీనియర్ సహకారవేత్త పరుచూరి అంజియ్య, సొసైటీ అధ్యక్షులు పరుచూరి శ్రీనివాసరావు, కోనేరు నాగేశ్వరరావు, బళ్ళ సీతారాం ప్రసాద్, నాయకులు రావి రత్నగిరి, దొప్పలపూడి జగదీష్, డోకిపర్తి బాల కోటేశ్వరరావు, యడ్లపల్లి బుజ్జి, దేవాదాయ శాఖ అధికారులు ప్రవీణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply