జగదేవుపేటలో అధికారుల ఇన్వెస్టిగేష‌న్‌

వెల్గటూర్, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ కరెంట్ మోటార్ల (Agricultural Current Motors)కు కనెక్షన్లు ఇప్పిస్తానని వెల్గటూర్ మండల సబ్ స్టేషన్ పరిధిలోని జగదేవుపేట (Jagadevpet)లో ఆన్ మ్యాన్డ్ విధులు నిర్వహిస్తున్న నరేష్ రూ. లక్షల్లో దోచుకున్నట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘటన పై శనివారం జగిత్యాల జిల్లా (Jagtial District) వెల్గటూర్ మండలంలోని జగదేవుపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఓంకార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయ‌తీ ఆవరణలో విచారణ (investigation) చేపట్టారు.

ఈ విషయంపై విజిలెన్స్ (vigilance) ఎస్‌ఐని వివరణ కోరగా… ఈ ఘటనపై నరేష్ తోపాటు అతని తండ్రి వేముల లింగయ్యను కూడా విచారణ చేయాల్సి ఉంటుందని, అతనిని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్ల రెడ్డి,కానిస్టేబుల్స్ శ్రీకాంత్ గౌడ్,తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply