కరపత్రాల ఆవిష్కరణ..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కరపత్రల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి అధ్యక్షతన ఆదివారం సీనియర్ సిటిజన్స్ ఫోరం సుభాష్ నగర్ ఎందుకలా భవనంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య సీనియర్ సిటిజన్స్ ఫోరం సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రపంచ వినియోగదారుల ఉద్యమం 1962 మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి పార్లమెంటులో చట్టం చేసి నాలుగో హక్కులను కల్పించి 1973 నుంచి ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు ప్రతి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.

1986 నుండి మనదేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించి హక్కుల కల్పించడం డిసెంబర్ 24 నాడు రాష్ట్రపతి ఆమోదం తెల్పడం వలన జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రతి మనిషి వినియోగదారులుగా తమ తమ హక్కులను బాధ్యతలను తెలుసుకోవాలని ఆమె కోరారు. కల్తీలను గుర్తించాలని సేవ లోపాలను తెలుసుకోవాలని ఆన్లైన్ మోసాలను గుర్తించాలని మోసపూరిత ప్రకటనలను నమ్మ వద్దని ఆమె అన్నారు.

సీనియర్ సిటిజం ఫోరం అధ్యక్షులు కే నారాయణ రెడ్డి మాట్లాడుతూ 2019 చట్టంలో చాలా మార్పులు వచ్చాయని వినియోగదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు మోసాలు జరిగినప్పుడు జిల్లా సమాఖ్యను సంప్రదించవచ్చని కేసులు వేయడానికి జిల్లాలో ఫోరం ఉందని అన్నారు. సమైక్య ప్రధాన కార్యదర్శి లింగయ్య వందన సమర్పణ చేశారు.

గౌతమీ వినియోగదారుల సంఘాల సలహాదారులు, రిటైర్డ్ అధ్యాపకులు బాల మల్లు గౌరవ అధ్యక్షులు టి భూమయ్య, అసోసియేట్ అధ్యక్షులు రవీంద్రనాథ్ ప్రధాన కార్యదర్శి వి. విజయ్ కుమార్ కోశాధికారి ఎస్. భూమన్న, జాయింట్ సెక్రెటరీ ఎస్ ధర్మరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుజరాతి రాజేశ్వర్, సలహాదారులు నల్ల రాజారెడ్డి ఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply