అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  • సెల్ టవర్ బ్యాటరీ చోరీలు
  • 5గురి అరెస్ట్,పరారీలో మరో ఇద్దరు
  • 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2 లక్షల 60 వేల నగదు
  • 2 ట్రాలీలు,2 టూ వీలర్స్ సీజ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్లకు సంబంధించిన బ్యాటరీలను చోరీలు చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.ఐదుగురు దొంగలను అరెస్టు చేయగా,మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుల నుండి హసన్ పర్తి పోలీసులు ఒక లక్ష 98 వేల రూపాయల విలువ గల 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2 లక్షల 60 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.రెండు ట్రాలీలు , రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు నల్గోండ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

కొంపల్లి గణేష్ (27),బొంగరాల.సుధాకర్ (30),తన్నీరు శివాజీ (26), బీమనబోయిన నరసింహ (31), గడగోజు సురేష్ (25)లుగా గుర్తించారు.ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్) మిగితా ఇద్దరు నిందితులైన సుధాకర్,శివాజీ లకు జనరేటర్ మరమ్మత్తులు, సెల్ టవర్ పనులకు పరిజ్ఞానం కలిగి ఉన్నారు.వీరంతా ముఠా గా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో సెల్ టవర్లపై పరిజ్ఞానం కలిగి ఉన్న అనుభావంతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల్లోని కొన్నింటిని తప్పించి, చోరీలు చేసేవారు.

చోరీ సమయాల్లో సెల్ టవర్ పని తీరులో ఎలాంటి సమస్యలు రావని గుర్తించిన తర్వాతే నిందితులు సెల్ టవర్ బ్యాటరీలను చోరీలకు పాల్పడే వారు. ఈ ముగ్గురు నిందితులు సెల్ టవర్‌లోని బ్యాటరీలను చోరీ చేసి మహరాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో ముగ్గురు నిందితులు జల్సాలు చేసేవారు. ఇదే సమయంలో రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలను దొంగతనాలకు పాల్పడే మిగితా ముఠా సభ్యులు సైతం కలవడంతో, ఈ ముఠా సభ్యులు చేపలు చోరీలకు పాల్పడటం మొదలు పెట్టారు. చోరీ సమయంలోనే బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలంగా వున్న సెల్ టవర్లను గుర్తించి,సదరు సెల్ టవర్లలోని బ్యాటరీలను చోరీలు చేసే వారు.అలాగే చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గోండ జిల్లాల్లో తక్కువ ధర విక్రయించేవారు.

ఈ తరహలో నిందితులు వరంగల్ కమిషనరేట్, యాదాద్రి, నల్గోండ,సూర్యాపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారు. గత నెల 3వ తారీకున హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ ప్రాంతంలోని సెల్ టవర్ నుండి 48 బ్యాటరీలకు చోరీలు చేశారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న హసన్ పర్తి పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత అధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాపు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ముఠా సభ్యులను గుర్తించారు. పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు.

పక్కా సమచారంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులు చోరీ సొత్తును అమ్మేందుకు హసన్‌పర్తి మండలం, దేవన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వేచి వున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను హసన్ పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు ఇచ్చిన సమచారం తో పోలీసులు చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్ చేరాలు, ఎసైలు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్ళు క్రాంతి కుమార్, బావు సింగ్,వెంకట స్వామి, భరత్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave a Reply