ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఎండ‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వేనంక సహస్ర అనే ఇంట‌ర్ విద్యార్థిని ఊరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. కుమ్మరిపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో స‌హ‌స్ర‌ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.

గత నెలలో ముక్కు సమస్యతో జగిత్యాల ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంది. ఇటీవల నొప్పి ఎక్కువ కావడంతో స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. తండ్రి రవి, పిన్నతల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి అమ్మమ్మ పోరండ్ల సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్గటూర్ ఎస్‌ఐ ఆర్. ఉమాసాగర్ తెలిపారు.

Leave a Reply