ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షకు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు ఏడు మంది విద్యార్థులు గైరాజరైనట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్ ప్రథమ సంవత్సర సంవత్సర రసాయన వ్యాపార గనక శాస్త్రం పరీక్షలకు137 మంది విద్యార్థులకు గాను 6 మంది విద్యార్థులు పరీక్షలకు గైరాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ అంబాజీ, డిపార్ట్మెంటల్ అధికారి వెంకటేశ్వర్ నివాస్ తెలిపారు.

ఒకేషనల్ పరీక్ష కు 40 మంది విద్యార్థులకు గాను ఒక విద్యార్థి గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు వైద్య సదుపాయంతాగునీరు తోపాటు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Leave a Reply