Integrated School | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను

Integrated School | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాను

  • తూడుకుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సత్యవరం లక్ష్మి కరుణాకర్ రెడ్డి

Integrated School | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) సహకారంతో కృషి చేస్తానని తూడుకుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సత్తవరం లక్ష్మి కరుణాకర్ రెడ్డి తెలిపారు.

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. పారిశుధ్యం, డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నిధులతో గ్రామాభివృద్ధి(Village development)కి కృషి చేయడం జరిగిందని ఆమె వివరించారు.

కాంగ్రెస్ అభివృద్ధిని చూసి గెలిపించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇదే కాకుండా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూలు(Integrated School), రోడ్లు సోలార్ విద్యుత్తు, ఇంకా అనేక సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేశారని, వారి నాయకత్వంలో పనిచేస్తామని లక్ష్మీ కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, సేవ కోసమే రాజకీయాలకు వచ్చానని ఆమె తెలిపారు.

Leave a Reply