క్రాకర్స్ తయారీ యూనిట్లలో తనిఖీలు..

క్రాకర్స్ తయారీ యూనిట్లలో తనిఖీలు..

కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పండుగల సందర్భంగా లైసెన్స్డ్ ఫైర్ క్రాకర్స్ దుకాణాలు, గోదాములు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాల అమలు పరిస్థితిని పరిశీలించేందుకు పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ కె. శ్రీనివాసరావు రెవెన్యూ, ఫైర్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి వేకనూరు గ్రామంలోని లైసెన్స్డ్ అంకమ్మ తల్లి ఫైర్ క్రాకర్స్ షాప్, తుంగలవారిపాలెం గ్రామంలోని లైసెన్స్డ్ దుకాణాలను తనిఖీ చేయడమైనది.

మోపిదేవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ పి.గౌతమ్ కుమార్ ఫైర్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి పర్మినెంట్ లైసెన్స్డ్ క్రాకర్స్ దుకాణాలను తనిఖీ చేయడమైనది. కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ ఎ.పైడిబాబు రెవెన్యూ, ఫైర్ విభాగాల అధికారులతో కలిసి పడతడిక ఫైర్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ను సందర్శించి భద్రతా ప్రమాణాలను పరిశీలించడమైనది. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సి.ఐ సోమేశ్వరరావు, ఎస్‌ఐ ఎన్.చంటి బాబు, ఎంఆర్వో గుడివాడ మరియు ఫైర్ సిబ్బందితో కలిసి మల్లాయపాలెం గ్రామంలోని లక్ష్మి శ్రీనివాస ఫైర్ క్రాకర్స్, వినాయక సి మార్ట్ ఫైర్ క్రాకర్స్ లైసెన్స్డ్ దుకాణాలలో సంయుక్త తనిఖీలు నిర్వహించారు.

చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సి.ఐ కె. ఈశ్వరరావు, ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు ఫైర్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, పోలీస్ విభాగాలతో కలిసి చల్లపల్లి క్రాకర్స్ సేల్స్ గోదాంలో సంయుక్త తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో లైసెన్స్ నిబంధనలు, ఫైర్ సేఫ్టీ పరికరాల లభ్యత, ఎలక్ట్రికల్ భద్రత, నిల్వ పరిమితులు, అగ్ని ప్రమాద నివారణ చర్యలను ప్రత్యేకంగా పరిశీలించడమైనది. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply