Innovation | పోస్టర్లు ఆవిష్క‌ర‌ణ

Innovation | పోస్టర్లు ఆవిష్క‌ర‌ణ

  • 21న ప‌ల్స్ పోలియో

Innovation | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఈ రోజు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గానికి చెందిన వైద్యాధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజం దిశగా ఇది కీలక కార్యక్రమమని తెలిపారు. ఆదివారం బూత్‌లలో పోలియో చుక్కల పంపిణీ చేపట్టి, సోమవారం, మంగళవారం రోజుల్లో ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Leave a Reply