షావోమీ కొత్త పరికరాల్లో ఇండస్ యాప్‌స్టోర్

భారతదేశపు స్వదేశీ ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్ ప్లేస్ అయిన ఇండస్ యాప్‌స్టోర్, సాంకేతిక ప్రపంచంలో ముందంజలో ఉన్న షావోమీ ఇండియాతో పలు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలో ఇకపై విడుదలయ్యే అన్ని కొత్త షావోమీ స్మార్ట్‌ఫోన్లలో ఇండస్ యాప్‌స్టోర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, ఇదివరకే వినియోగంలో ఉన్న పాత పరికరాల్లో ప్రస్తుతం ఉన్న ‘గెట్‌యాప్’ను ఇండస్‌ యాప్‌స్టోర్‌తో భర్తీ చేయాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు.

ఈ భాగస్వామ్యం గురించి ఇండస్ యాప్‌స్టోర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రియా ఎమ్ నరసింహన్ మాట్లాడుతూ, “భారతీయ మొబైల్ యూజర్లు, అలాగే డెవలపర్లకు సమాన స్థాయిలో అందుబాటులో ఉండే యాప్ స్టోర్‌ను రూపొందించాలనే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో, షావోమీ ఇండియాతో మేము కుదుర్చుకున్న భాగస్వామ్యం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

షావోమీ ఇండియా మార్కెట్ పరిధికి, పలు భారతీయ భాషల్లో లభించే మా యాప్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌‌ను అనుసంధానించడం వల్ల, యూజర్లకు నిరాటంకంగా, సాంస్కృతిక పరమైన అనుభవాన్ని అందిస్తూనే యాప్‌ డెవలపర్లకు చక్కని అవకాశాలను సృష్టిస్తున్నాము. భారతదేశ ప్రజలు మొబైల్ యాప్‌లను గుర్తించే పద్ధతిని, పొందుతున్న అనుభవాన్ని మెరుగుపర్చాలనే మా లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఆరంభం మాత్రమే” అని అన్నారు.

ఈ భాగస్వామ్యంపై షావోమీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధిన్ మాథుర్ మాట్లాడుతూ, “భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం వల్ల, స్థానికంగా క్రియేట్ చేసిన, అలాగే స్థానికుల కోసమే డెవలప్ చేసిన యాప్‌లు ఉండే మార్కెట్‌ప్లేస్‌కు మునుపెన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది.

షావోమీ ఇండియాలో విధులు నిర్వహించే మేమంతా, ఎల్లప్పుడూ ‘మేక్ ఫర్ ఇండియా’ ఆవిష్కరణలకు మద్దతుగా నిలిచాము, అలాగే ఇండస్ యాప్‌స్టోర్‌తో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం కూడా ఆ దిశలో వేసిన ఒక వ్యూహాత్మక అడుగు.

ఇండస్ యాప్‌స్టోర్‌ను మా ఎకోసిస్టమ్‌తో అనుసంధానించడం వల్ల, యూజర్లకు నిరాటంకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రయోజనకరమైన యాప్‌లను వెతికి, సులభంగా పొందే అనుభవాన్ని అందించాలనే మా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము.” అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *