(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గ అమ్మ సన్నిధికి ఆదివారం హడ్కో అధికారం బృందం విచ్చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుల్షరెస్టా, కార్పొరేట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎం నాగరాజు, ఫైనాన్స్ డైరెక్టర్ దిల్జిత్ సింగ్ కటారి, ఆంధ్రప్రదేశ్ రీజినల్ చీఫ్ బిఎస్ఏ మూర్తి, ఇతర అధికారులు శ్రీనివాస్ టి సుబ్బారావు లు,ఇంద్రకీలాద్రి వచ్చిన వీరికి ప్రభుత్వ అధికారులను ఆలయ సంప్రదాయం ప్రకారం పండితులు, అధికారులు ఘన స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఏర్పాటు చేసి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.