ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రభ)తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయం, నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులు, కోట్ల రూపాయల ఆదాయం, మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయల ఖర్చు అయినా సామాన్య భక్తుడికి అమ్మ దర్శనం మాత్రం గగనమే. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు మీన మీసాలు లెక్కిస్తుంటే ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కే రామచంద్ర మోహన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం ఆచరణలో పెట్టడం లేదు.

అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఈవో రామచంద్ర మోహన్ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనడానికి నిదర్శనమే ఇంద్రకీలాద్రిపై ఈవో ప్రత్యక్షంగా చూసిన కొన్ని సంఘటనలు. అధికారుల పని తీరుపై అసహనం..అమ్మవారిని దర్శించుకున్నందుకు భక్తులు వచ్చే రద్దీ సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈవో రామచంద్ర మోహన్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శుక్రవారం ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున కొంతమంది అధికారులకు ప్రత్యేక విధులను సైతం కేటాయించారు.
క్యూలైన్లతో పాటు ప్రధానాలయం వంటి ప్రదేశాలలో సిబ్బందిని అదనంగా నియమించి భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం అయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే విఐపి లకు ప్రత్యేక నమయాన్ని కూడా కేటాయించారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో 500 టికెట్లను నిలుపుదల చేయడంతో పాటు అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసి భక్తులకు శీఘ్రంగా అమ్మవారి దర్శనం కల్పించేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆదివారం ఇంద్రకీలాద్రి పైకి వచ్చిన ఈవో రామచంద్ర మోహన్ కు ప్రధాన ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో కనిపించిన కొన్ని సంఘటనలతో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రధాన ఆలయం ఎదురుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వారిని త్వర త్వరగా బయటకు పంపించేలా సరైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడ లేకపోవడం పర్యవేక్షించే అధికారులు కూడా లేకపోవడంతో ఆయన అవాక్కయ్యారు.

ఇదే సమయంలో ఆయన దర్శనానికి వెళ్తున్న సందర్భంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండడం ప్రతి ఉన్నప్పటికీ అంతరాలయ దర్శనం కల్పించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ప్రధాన ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హుండీని గతంలో తీసివేయాలని రెండు మూడుసార్లు ఈఓ చెప్పినప్పటికీ అధికారులు తీసివెయ్యకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈవో ఉన్న సందర్భంలో కొంతమంది సిబ్బంది అమ్మవారి దర్శనానికి ఎదురుగా వెళ్లడం కూడా చూసి సిబ్బందిని హెచ్చరించారు. క్యూ లైన్ లలో భక్తులు ఎక్కువ సేపు ఎదురు చూడటం పర్యవేక్షించాల్సిన ఏఈఓ కూడా అందుబాటులో లేకపోవడం ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. ప్రధాన ఆలయ ఏఈఓ వచ్చేంతవరకు ఎదురుచూస్తున్నా ఏఈఓ చంద్రశేఖర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భక్తుల రద్దీ సమయాలకు సంబంధించి తాను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఖాదర్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. సాధారణ భక్తులకు మీరు ఏం చేస్తున్నారని, ప్రతి ఎక్కువై భక్తులు బయట క్యూ లైన్ లలో ఎదురుచూస్తున్న సంగతి మీకు తెలుసా అని ప్రశ్నించారు. జూలై నెలలో భక్తుల రద్దీన్ నియంత్రించేందుకు సరిపడినంత సిబ్బంది లేకపోవడం, ప్రతి సమయంలో అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ వారు అందుబాటులోకి లేకపోవడం ఆయనకు మరింత అగ్రహాన్ని తెచ్చిపెట్టింది.
ఇప్పటికైనా పని తీరు మార్చుకోకపోతే మందిత అధికారులపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించిన ఆయన తగినంత మంది సెక్యూరిటీ సిబ్బంది లేని కారణంగా, సంబంధిత ఏ ఈ ఓ తో పాటు ప్రధానాలయ ఏఈఓ కు చార్జ్ మెమో ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. స్వయంగా ఈవో రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై పర్యటించి తలెత్తుతున్న లోపాలను సరి చేసేందుకు ఆదేశాలుస్తున్నప్పటికీ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కమిషనర్ రామచంద్ర మోహన్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.