Indonesia | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కొండ చరియలు విరిగిపడి 17మంది మృతిచెందగా,73మంది గల్లంతైన విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది. పశ్చిమ జావా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 30కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.