T202026| అలా జరుగుతుందంటారా..?

T202026| అలా జరుగుతుందంటారా..?
T202026| టీ20 ప్రపంచ కప్‌లో భారత్ భవిష్యత్ ప్రశ్నార్థకం
భారత్ సెమీస్ చేరుతుందా….?
ఇంటి బాట పడుతుందా..?
ఇతర జట్ల జయపజయాలపై ఆశలు
కీలకం కానున్న దక్షిణాఫ్రికా..!
T202026|ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ పరిస్థితి దారుణంగా మారింది. సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీస్‌కు చేరడం సంక్లిష్టం అయ్యింది. 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఇక టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే ఇతర జట్ల జయపజయాలపై ఆధారపడాల్సి ఉంది.

దక్షిణాఫ్రికాపైనే ఆశలు
దక్షిణాఫ్రికాపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. సఫారి జట్టు గెలుపోటములపైనే టీమిండియా సెమీస్ చేరడం లేదా.. ఇంటి బాట పట్టడమా అనేది ఆధారపడి ఉంది. భారత్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాలి. దక్షిణాఫ్రికా తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ (వెస్టిండీస్, జింబాబ్వేపై) విజయం సాధించాలి. అదే సమయంలో టీమిండియా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాలి. వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలని భారత్ కోరుకోవాలి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే.. మూడు జట్లు 4 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది, అందులో భారత్ (-3.80) చాలా వెనుకబడి ఉంది.

అలా జరుగుతుందనుకోవడం అత్యాశే..
“వెస్టిండీస్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే వారు ఏదైనా చేయగలరు. రన్ రేట్ విషయంలో ఆ జట్టు (+5.35) చాలా ముందుంది. సాధారణంగా టీ20ల్లో ఒక జట్టు చేసే మొత్తం పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యం (183 రన్స్) సాధించడం దాదాపు అసాధ్యం. అలా జరగకపోతే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మన రైలు మళ్లీ పట్టాలెక్కాలంటే దక్షిణాఫ్రికా తప్పకుండా వెస్టిండీస్‌ను ఓడించాలి.

గురువారంతో తేలిపోతుంది..
ఫిబ్రవరి 26, గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఆ మ్యాచ్ ఫలితం తేలిన తర్వాతే సాయంత్రం భారత్, జింబాబ్వే మధ్య పోరు జరగనుంది. ఆ రోజు ఫలితాలే టీమిండియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
