ఆర్చరీలో తొలి స్వర్ణం ప‌ట్టేసిన భార‌త జ‌ట్టు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆర్చరీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్ (Archery World Championship)లో భారత్ పురుషుల జట్టు (ndia Men’s Team) అద‌ర‌గొట్టింది. దక్షిణ కొరియా (South Korea)లో జ‌రుగుతున్న ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఫ్రాన్స్‌పై 235-233 తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. ఈ పోటీలో భారత పురుషుల జట్టు తొలిసారిగా బంగారు పతకం (gold medal) గెలుచుకోవడం విశేషం.

ఇక ఇదే రోజు భారత్‌కు రెండో స్వర్ణావకాశం వచ్చింది. రిషభ్‌ యాదవ్‌, జ్యోతి శురేఖ వేణం జోడీ మిక్స్‌డ్‌ కంపౌండ్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడింది. మొదట ఆధిక్యంలోకి వచ్చినా, ఒక సెట్లో 37 పాయింట్లకే పరిమితమవడంతో నెదర్లాండ్స్ (Netherlands) తిరిగి ఆధిపత్యం చెలాయించింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ డచ్‌ జోడీ (Dutch Pair) విజయం సాధించగా, భారత జోడీ రజతంతో సరిపెట్టుకుంది.

Leave a Reply